Surya Nakshatra Parivartan 2023: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. జూలై 16న సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. మరో రెండు రోజుల్లో అంటే జూలై 20న భాస్కరుడు తన నక్షత్రాన్ని మార్చుకుని పుష్య నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుని సంచారం కరుణ, నాయకత్వం, దాతృత్వం, భావోద్వేగం మరియు ఆధ్యాత్మికతను ప్రభావితం చేస్తుంది. సూర్యుడు పుష్య నక్షత్రంలో ప్రవేశిస్తే ఏ రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం- సూర్యుని నక్షత్ర మార్పు మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. దీంతో మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
మిథునరాశి- పుష్య నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మిధున రాశి వారి స్కిల్స్ పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు డబ్బును పొదుపు చేస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది. 
వృశ్చిక రాశి- సూర్యుని రాశి మార్పు వృశ్చిక రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్లో వచ్చే అడ్డంకులన్నింటినీ అధిగమిస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 


Also Read: Rajyog 2023: సింహరాశిలో అరుదైన రాజయోగం.. వీరి బతుకులు మారడం ఖాయం..


ధనుస్సు- సూర్యుని రాశి మార్పు ధనుస్సు రాశి వారికి భారీ మెుత్తంలో ధనాన్ని ఇస్తుంది. మీరు మంచి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలు మీకు అనుకూలించే అవకాశం ఉంది.
మీనం- మీన రాశిలో సూర్యుని సంచారం వల్ల మీరు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్యంగా క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
(Disclaimer:ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Budh Gochar 2023: జూలై 25న కీలక పరిణామం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook