Surya Dev: తులరాశిలోకి సూర్యభగవానుడు.. ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..
Surya Gochar 2022: తొమ్మిది గ్రహాలలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్య రాశిలో మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Rashi Parivartan Effect on Zodiac Signs: జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. ఆదిత్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతాడు. అలాంటి సూర్యదేవుడు (Surya Dev) రాశి మార్పు అనేది ఆస్ట్రాలజీలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు.
ఈ నెల 17న సూర్యభగవానుడు కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి (Sun transit in Libra 2022) ప్రవేశించనున్నాడు. దాదాపు 11రోజులపాటు ఆ రాశిలోనే ఉండనున్నాడు. కన్యారాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడి రాశిలో సూర్యుడి సంచారం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. అందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
మేష రాశి (Aries)- తుల రాశిలో సూర్య సంచారం ఈ రాశివారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. 11 రోజులపాటు మీరు చేసిన కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. సూర్యుడి అనుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు. ఈ సమయంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది.
ధనుస్సు (Sagittarius)- సూర్య రాశి మార్పు వల్ల ధనుస్సు రాశి వారికి లక్ కలిసి వస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం అద్బుతంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio)- సూర్య సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరికైనా అప్పు ఇచ్చిన డబ్బు మీ వద్దకు తిరిగి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారుల లాభపడతారు.
Also Read: Guru Margi 2022: బృహస్పతి 'పంచ మహాపురుష రాజయోగం'.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి