Sun Transit 2022: మరో 3 రోజుల్లో ఈ రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా మరి..
Sun Transit 2022: వృశ్చికరాశిలో సూర్యుని సంచారం 5 రాశుల వారికి శుభప్రదం కానుంది. వీరు కెరీర్ లో పురోగతితోపాటు ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు.
Sun Transit 2022: సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. మరో మూడు రోజుల్లో అంటే నవంబర్ 16, 2022న సూర్యుడు వృశ్చికరాశిలో (Sun Transit In Scorpio 2022) ప్రవేశించనున్నాడు. దీనినే వృశ్చిక సంక్రాంతి అంటారు. సూర్యుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. సూర్య సంచారం 5 రాశులవారికి ప్రత్యేకంగా ఉండనుంది. వీరు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధించనున్నారు. వృశ్చికరాశి సంక్రాంతి ఏ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కెరీర్‌కు ఇదే అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
సింహ రాశి (Leo): సూర్య సంచారం సింహ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. పెట్టుబడికి అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.
తుల (Libra): సూర్యుని రాశి మార్పు తులారాశి వారికి చాలా మంచిది. డబ్బు ఆదా అవుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. మీరు కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio): వృశ్చికరాశిలో సూర్యుడి సంచారం ఈరాశి వారిపై గరిష్ట ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి సూర్యుడు రాశి మారడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
Also Read: Samsaptak RajYog: తిరోగమన కుజుడి 'సంసప్తక రాజయోగం'.. ఈ 3 రాశులకు వృత్తి-వ్యాపారంలో విజయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి