Sun Transit in aries 2023: సూర్యభగవానుడు ఇవాళ మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మే 15 వరకు సూర్యుడు అదే రాశిలో ఉంటాడు. కీర్తి మరియు విజయానికి కారకుడైన సూర్యుడు రాశిలో మార్పు ప్రజలందరిపై  పెను ప్రభావం చూపుతుంది. భానుడు యెుక్క ఈ గోచారం ఐదు రాశులవారికి ప్రయోజనం కలుగుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య గోచారం ఈ రాశులకు వరం
కర్కాటకం: సూర్యుని గోచారం కర్కాటక రాశి వారికి భారీ ధనలాభాలను ఇస్తుంది. మీకు నచ్చిన ప్రమోషన్ లేదా జాబ్ ఆఫర్ పొందవచ్చు. పని ప్రదేశంలో మీకు మంచి వాతావరణం ఉంటుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. 
సింహ రాశి: ఈ రాశికి సూర్యుడు అధిపతి. మీకు ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. మీరు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీరు వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. 
మేషం: సూర్య సంచారం ఇదే రాశిలో మాత్రమే జరుగుతుంది. మీరు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీరు కొత్త ఉద్యోగంలో చేరుతారు. వ్యాపారంలో మీరు మంచి లాభాలను గడిస్తారు. 


Also Read: Grahan Yog 2023: నేటి నుంచి 'గ్రహణ యోగం'... వచ్చే నెల రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్త..


మిథునం: సూర్యుని రాశి మార్పు మిథునరాశి వారికి గొప్ప విజయాన్ని ఇస్తతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు పెద్ద పదవి లేదా కొత్త బాధ్యతను తీసుకుంటారు. వ్యాపారస్తులు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. 
వృశ్చికం: సూర్య సంచారం వృశ్చిక రాశి వారికి ప్రమోషన్ మరియు ఆదాయాన్ని ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. మీరు ఎక్కువ లాభం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. 


Also Read: Grah Gochar: ఈ రాశులపై 3 గ్రహాలు డబ్బు వర్షం కురిపించనున్నాయి.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook