Surya Gochar 2024 in taurus: కాంతిని ప్రసాదించే సూర్యుడు నెలకొకసారి తన రాశిని మార్చి వేరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద సూర్యభగవానుడు 12 రాశిచక్రాల్లో సంచరిస్తాడు. భాస్కరుడు యెుక్క ఈ రాశి మార్పునే మన పంచాంగ కర్తలు సంక్రాంతి అని పిలుస్తారు. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న ఆదిత్యుడు మే 14న శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు వృషభరాశిలో జూన్ 14 వరకు ఉండబోతున్నాడు. ఈ కాలంలో మూడు రాశులకు చెందిన వ్యక్తులు లగ్జరీ లైఫ్ ను పొందబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు. దీంతో సింహరాశి వారు ఇంతకముందు ఎప్పుడూ పొందని ప్రయోజనాలను పొందుతారు. మీరు కెరీర్ లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. ఇతరులతో మీ బంధం బలపడుతుంది. మీ జీవితం సాఫీగా సాగుతోంది. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లభిస్తుంది, జీతం కూడా పెరుగుతుంది. 
మేషరాశి
సూర్యభగవానుడు రాశి మార్పు కారణంగా మేషరాశి వారి స్పెషల్ బెనిఫిట్స్ పొందబోతున్నారు. మీరు ఒక్కసారిగా భారీ మెుత్తంలో ధనాన్ని పొందుతారు. మీరు ఆర్థిక పరిస్థితి సడన్ గా మారిపోతుంది. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. వ్యాపారం చేసే వారు నాలుగు రెట్లు లాభాలను పొందుతారు. ఎంతోకాలంగా  పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 
కుంభ రాశి
కుంభరాశికి చెందిన వ్యక్తులకు ఆదిత్యుడు సంచారం బంపర్ ప్రయోజనాలు ఇవ్వబోతుంది. మీరు భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. మీరు ఇంటి కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కూడా భారీగానే కొంటారు. మీకు జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది.  మీ కెరీర్ కూడా గతం కంటే బాగుంటుంది. 


Also Read: Rasi Phalalu 2024: మే నెల లక్కీ రాశులవారు వీరే.. ఈ రాశులవారికి ధన లాభాలు!


Also Read: May 2024 festivals full list: మే నెలలో రానున్న ముఖ్యమైన పండుగల జాబితా ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి