Sun, Mercury and Saturn will Change June 2023:  ఆస్ట్రాలజీలో గ్రహాల కదలికలు చాలా ముఖ్యమైనవి. ఈ నెలలో బుధుడు, సూర్యుడు మరియు శని గ్రహాలు గమనంలో పెను మార్పు రాబోతుంది. జూన్ 07న బుధుడు వృషభరాశిలోకి, జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 17న శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. మరోవైపు జూన్ 19న మెర్క్యూరీ వృషభరాశిలో అస్తమించనున్నాడు. మళ్లీ జూన్ 24న మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల యెుక్క ఈ రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధునరాశి
గ్రహాల గమనంలో మార్పు మిథునరాశి వారికి అస్సలు కలిసి రాదు. ప్రయాణాలు మానుకోండి. మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఈ సమయంలో మీరు మాటలను అదుపులో ఉంచుకోండి. మీకు మానసిక ప్రశాంతత ఉండదు. మీరు పిల్లల వైపు నుండి సమస్యలను ఎదుర్కోంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది.


కర్కాటక రాశి
గ్రహాల సంచారం వల్ల కర్కాటక రాశి వారి మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాబోయే కొన్ని రోజులు మీ సొంత వ్యాపారాన్ని చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఈ సమయంలో ప్రయాణాలు మానుకోండి. డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. 


Also Read: Kendra Trikon Rajyog: జూన్ 17న కీలక పరిణామం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..


మేషరాశి
గ్రహాల రాశి మార్పు వల్ల మేషరాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మీ జీవితంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీ జీవనశైలిని సరిగ్గా ఉంచుకోండి. ఈ సమయంలో ఉద్యోగం మారకండి.


మకరరాశి
గ్రహాల సంచారం వల్ల మీరు జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోంటారు. ఈ సమయంలో అస్సలు పెట్టుబడి పెట్టొద్దు. మీ ఫ్యామిలీలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంది.


Also Read: Shani Vakri 2023: శష్ రాజయోగంతో మారనున్న ఈ 3 రాశుల ఫ్యూచర్.. మీది ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook