Anuradha Nakshatra In Kundli: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ మార్పు కొంతమందికి లాభదాయకంగానూ, మరికొందరికి నష్టపూర్వకంగానూ ఉంటుంది. ఈ నెల మధ్యలో బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు వృశ్చికరాశిలో ప్రవేశించారు. అంటే ఈ మూడు గ్రహాలు కలిసి కుజుడు మరియు శని యెుక్క అనురాధ నక్షత్రంలో (Sun Mercury And Venus Planet In Anuradha Nakshatra) ఉన్నాయి. దీంతో మూడు రాశులవారి ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): అనురాధ నక్షత్రంలో బుధుడు, సూర్యుడు మరియు శుక్ర గ్రహాల స్థానం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో మీ నిలిచిపోయిన పని పూర్తవుతుంది. అలాగే మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి ప్రయోజనం పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి మీ మనస్సును మార్చుకోవచ్చు.  మీరు అన్ని రకాల భౌతిక సుఖాలను పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


మకరం (Capricorn): అనురాధ నక్షత్రంలో బుధుడు, సూర్యుడు మరియు శుక్ర గ్రహాల స్థానం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీరు విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. 


కుంభం (Aquarius): అనురాధ నక్షత్రంలో కూర్చున్న బుధుడు, సూర్యుడు మరియు శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటారు. ఈ సమయంలో మీరు అదృష్టాన్ని పొందుతారు. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు ఆఫీసులో ఆశించిన ఫలితాలు పొందుతారు. పెండింగ్ లో ఉన్న మీ పనులు పూర్తవుతాయి. 


Also Read: Rahu Transit: 2023 అక్టోబరు వరకు మేషరాశిలో రాహువు... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి