Surya Gochar 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు రేపు అంటే జనవరి 14, 2023న తన రాశిని మార్చుకోనున్నాడు. రాత్రి 8.22 గంటలకు సూర్య దేవుడు (Surya Gochar 2023) శనిదేవుని రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆస్ట్రాలజీలో సూర్య భగవానుడిని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. సూర్యభగవానుడి సంచారం ఏయే రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషం (Aries): మేషరాశి యెుక్క ఐదవ ఇంటికి సూర్యభగవానుడు అధిపతి. మీ జాతకంలోని సూర్యభగవానుడు పదవ ఇంట్లో కూర్చుంటాడు. దీంతో మీరు మీ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం ఎదురుచూస్తున్న వారి కల ఫలిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
కన్య జాతకం (Virgo): ఈ రాశి యెుక్క సూర్యభగవానుడు పన్నెండవ ఇంటికి అధిపతి. వీరి జాతకంలో సూర్య దేవుడు ఐదవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు సూర్యభగవానుడి సపోర్టు లభిస్తుంది. ఫ్యామిలీ  సపోర్టు లభిస్తుంది. 
ధనుస్సు రాశి (Sagittarius): సూర్యభగవానుడు మీ రాశి యెుక్క తొమ్మిదవ ఇంటికి అధిపతి. స్థానికుల జాతకంలో సూర్యభగవానుడు రెండవ ఇంట్లో సంచరిస్తాడు. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు కూడా వెళ్లవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.  


Also Read: Shani Asta 2023: కుంభరాశిలో శని సంచారం... సంక్రాంతి తర్వాత వీరి జీవితం కష్టాలమయం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి