sun saturn and mercury will form trigraha yoga in capricorn those zodiac signs people need to be careful : మరికొన్ని రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి కానుంది. కొత్త సంవత్సరం రానుంది. అయితే కొత్త సంవత్సరంలో మూడు గ్రహాలు ఒకే రాశిలోకి రానున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి సమస్యలు తలెత్తుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..2022లో మకరరాశిలోకి మూడు గ్రహాలు రానున్నాయి. సూర్యుడు, శని, బుధుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే శనిదేవుడు.. మకరరాశిలోకి వచ్చేశాడు. జనవరి 5న బుధుడు, జనవరి 14న సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ త్రిగ్రహ యోగం ఏర్పడడంతో 4 రాశులపై ప్రభావం పడనుంది. వారు ఆచితూచి వ్యవహరించకపోతే.. చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మరి ఆ నాలుగు రాశులపై పడే ప్రభావం ఏమిటి.. పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఒకసారి చూద్దాం..


కన్య (Virgo) 
మూడు గ్రహాలు మకర రాశిలోకి రావడంతో కన్యరాశిపై ప్రభావం పడనుంది. కన్యరాశి వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతే కాకుండా డబ్బు లావాదేవీల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


తుల రాశి (Libra)
త్రిగ్రహ యోగం వల్ల తుల రాశి వారికి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో విబేధాలు ఏర్పడవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. లవ్‌లో ఉన్న వారికి కూడా రిలేషన్‌లో సమస్యలు తలెత్తవచ్చు.


ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది..కానీ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే మీ పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు. అలాగే కుటుంబంలోని పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


Also Read : Shoonya masam 2021 : శూన్యమాసంలో ఆ పనులు అస్సలు చేయకండి.. ఇవి కచ్చితంగా చేయండి


మకరరాశి (Capricorn)
మూడు రాశుల కలయికతో మకర రాశి వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా పనిలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. మకరరాశి వారు ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.


Also Read : పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి