Sun Transit in Leo 2022: దేవతలందరికీ రాజు అయిన సూర్యదేవుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడు. సెప్టెంబరు 17 వరకు అదే రాశిలో ఉంటాడు. సింహరాశిలో సూర్య సంచారం (Sun Transit in Leo 2022) కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. వారికి దేనికీ లోటు ఉండదు. అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు సిద్దిస్తాయి. రాబోయే 12 రాశులవారికి శుభప్రదంగా ఉండబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధునరాశి (Gemini): మిథున రాశి వారికి రాబోయే 12 రోజులు చాలా లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులు భారీగా ఆర్జిస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు. మీరు బాగా మాట్లాడగలరు. డబ్బు లాభదాయకంగా ఉంటుంది.  


సింహరాశి (Leo): ఈ రాశివారి వ్యాపారం విస్తరిస్తుంది.  రచనల పట్ల ఆసక్తిపెరుగుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఉద్యోగులు లాభపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. 


వృశ్చిక రాశి (Scorpio): సింహరాశిలో సూర్య సంచారం వృశ్చికరాశివారి ఆదాయాన్ని పెంచుతుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. కుటుంబంతో సమయం గడుపుతారు. 


ధనుస్సు రాశి (Sagittarius): మీకు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువుల సహకారంతో వ్యాపారస్తులు లాభపడతారు. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది.


Also Read: Mars Transit in Gemini 2022: కుజుడు రాశి మార్పు... ఈ 3 రాశుల వారి లైఫ్ అదుర్స్..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook