COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sun Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాడు. అయితే ఈ రాశి సంచారం జరినప్పుడల్లా దాదాపు 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం మీ జాతకంలో ఉన్న స్థానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సూర్యుడు మీ జాతకంలో అనుకూల స్థానంలో సంచారం చేస్తే ఊహించని లాభాలు కలుగుతాయి. అదే ప్రతికూల స్థానంలో సంచారం చేస్తే అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


2023 సంవత్సరం చివరి నెల డిసెంబర్‌లో సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నడు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి సూర్యదేవుడి అనుగ్రహం లభించబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభావం 2024 సంవత్సరం వరకు కూడా ఉండబోతోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మిథునరాశి:
సూర్య గ్రహం సంచారం మిథునరాశివారికి ఎంతో ప్రయోజనకరంగా మారబోతోంది. ఈ సంచారం జీవితాన్ని ముందుకు నడిపిస్తూ విజయాల దిశగా తీసుకువెళ్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది. వీరికి అన్నదమ్ముల మద్దతు లభించి ఊహంచని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  


ధనుస్సు రాశి:
సూర్యుడి సంచారం ధనుస్సు రాశి వారికి ఫలప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దీంతో పాత అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. అయితే ఈ సమయంలో వీరు ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. 


మీన రాశి:
సూర్య గ్రహం సంచారం కారణంగా మీన రాశివారికి కూడా చాలా సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించి అన్ని పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతంది. దీంతో పాటు ఆర్యోగం కూడా మెరుగుపడుతుంది. ఈ సమయంలో సోదరుల సహాకారంతో విజయాలు సాధించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook