Surya Gochar 2023: రోహిణి నక్షత్రంలో సూర్య సంచారం.. ఈ 5 రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం..
Sun transit 2023: ప్రస్తుతం సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆదిత్యుడి నక్షత్ర రాశి మార్పు 5 రాశులవారికి మేలు చేస్తుంది. భానుడు సంచారం వల్ల ఏయే రాశులు వారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Surya Gochar 2023 effect: జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. రీసెంట్ గా సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరించాడు. చంద్రునికి ఇష్టమైన రోహిణి నక్షత్రంలో సూర్యుని సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆదిత్యుడి యెుక్క నక్షత్ర మార్పు 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం
ఆదిత్యుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారి కెరీర్ దూసుకుపోతుంది. మీకు వివిధ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వ్యక్తిత్వంతో పది మందిని ఆకట్టుకుంటారు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
సింహం
భానుడు సంచారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
ధనుస్సు
సూర్యుడి రాశి మార్పు ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. క్రీడలతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు.
Also read: Mercury transit 2023: మరో నాలుగు రోజుల్లో ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీరున్నారా?
మేషం
రోహిణి నక్షత్రంలో సూర్యుడి సంచారం వల్ల మేష రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృషభం
సూర్యుడి సంచారం వృషభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కీర్త ప్రతిష్టలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Shash Rajyog: జాతకంలో ఈ రాజయోగం ఉన్నవారు కింగ్ లా బతుకుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook