Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. అందుకే సూర్యుడి గోచారానికి ప్రత్యేకత, విశిష్టత ఉంటాయి. సూర్యుడు ప్రతి రాశిలో ప్రతి నెలా మారుతుంటాడు. ఫలితంగా సూర్య గోచారాన్ని బట్టి ప్రతి నెలా జాతకాలు మరుతుంటూనే ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం డిసెంబర్ 16న  సూర్యుడు ధనరాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడు ధనస్సులో ఉండటాన్ని ధన సంక్రాంతి అంటారు. ఫలితంగా నెలరోజుల వరకూ మూడు రాశులవారికి అదృష్టం మార్చేయనుంది. ఈ మూడు రాశులకు మహర్దశ పట్టనుంది. ధనరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు శుభకార్యాలకు దూరంగా ఉంటారు. అంటే ఈ సమయంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభాకార్యాలు తలపెట్టరు. 16 డిసెంబర్ 2023 నుంచి 15 జనవరి 2024 వరకూ ఈ పరిస్థితి ఉంటుంది. 2024 జనవరి 24న మకర సంక్రాంతి అత్యంత వైభవంగా జరుపుకుంటారు. జనవరి 15వ తేదీన సూర్యుడి మకర రాశిలో ప్రవేశించడంతో మకర సంక్రాంతి వస్తుంది. ఇక శుభ కార్యాలు ప్రారంభమౌతాయి. అయితే ఈ నెలరోజులు శుభకార్యాలకు మంచిది కాకపోయినా 3 రాశులవారికి మాత్రం అత్యంత అదృష్టకరంగా మారనుంది. 


వృశ్చిక రాశి జాతకులకు సూర్యుడి గోచారం శుభప్రదంగా ఉండనుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అత్యంత అనుకూలమైంది. ఊహించని ధనలాభం కలగడం వల్ల ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వ్యాపారం విస్తృతం కావచ్చు.


ఇక మేష రాాశి జాతకులకు సూర్యుడి గోచారం మహర్దశ పట్టించనుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఎలాంటి ఆర్ధిక సమస్యలు వెంటాడవు. ఊహించని ధనలాభం కలగడమే ఇందుకు కారణం. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అత్యంత అనువైన సమయంగా భావిస్తారు. ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 


తుల రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ రాశి జాతకులకు అంతా మేలే జరుగుతుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి లాభిస్తుంది. వ్యాపారులకు అనువైన సమయంగా భావిస్తారు. ఊహించని లాభాలు ఆర్జిస్తారు. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. 


Also read: Guru Margi 2023: 500 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook