Sun Transit 2023: ఇవాళ వృషభరాశిలోకి సూర్యుడు... వచ్చే నెల రోజులపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు..
Sun Transit 2023: ఈరోజు సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023 bad effect: నెలకొకసారి సూర్యభగవానుడు తన రాశిని చేంజ్ చేస్తాడు. ఆదిత్యుడి రాశి మార్పునే సంక్రాంతి అని పిలుస్తారు. ఇవాళ సూర్యభగవానుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అని పిలుస్తారు. సూర్య సంచార ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ముఖ్యంగా భానుడు సంచార సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మిధునరాశి
ఆదిత్యుడి సంచారం మిథునరాశి వారికి చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. మీ పనిలో అనేక అడ్డంకులు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీకు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు చాలా కేర్ పుల్ గా ఉండాలి.
తులారాశి
మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కడా ఇన్వెస్ట్ చేయవద్దు. పార్టనర్ షిప్ తో వ్యాపారం చేసేవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
భానుడి సంచారం కారణంగా మకరరాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మిత్రుల మధ్య గొడవలు రావచ్చు. మీరు ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది.
Also Read: Budhaditya Yog 2023: వృషభరాశిలో బుధాదిత్య రాజయోగం... ఈ రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం..
మేష రాశి
వృషభరాశిలో సూర్యుని సంచారం మేషవారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. వచ్చే నెల రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమయంలో మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
వృషభం
ఇదే రాశిలో సూర్యుడి సంచారం జరగబోతుంది. దీని కారణంగా మీరు మీ దాంపత్య జీవితంలో సమస్యలను ఎదుర్కోంటారు. మీ హెల్త్ చెడిపోయే అవకాశం ఉంది. మీ లైఫ్ ఇబ్బందుల్లో పడుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు.
Also Read: Hanuman Jayanthi 2023: ఈ 3 రాశులపై హనుమాన్ ప్రత్యేక ఆశీస్సులు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook