Sun Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు అధిపతిగా భావించే సూర్యుడు సంచారం చేసినప్పుడు అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ప్రతి నెల సూర్యుడు తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలో సంచారం చేస్తూ ఉంటుంది. సూర్యుడు జూలై 17 తెల్లవారుజామున 4:59 గంటలకు కర్కాటకరాశిలో సంచారం చేశాడు. కర్కాటక రాశిలో సూర్యుని రాకతో కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర ఇబ్బందుల నుంచి కూడా విముక్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై సూర్యుడి ప్రభావం:
మేష రాశి:

ఈ సూర్యుడి సంచారం కారణంగా మేష రాశివారు ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ క్రమంలో వీరు ప్రమోషన్స్‌ పొందడమే కాకుండా జీతాల్లో కూడా మార్పలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక ప్రైవేట్‌ రంగంలో పనులు చేసేవారికి కూడా ఈ సంచారం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా కష్టపడి పని చేసేవారు భారీగా లాభాలు పొందే ఛాన్స్ ఉంది. 


వృషభ రాశి:
వృషభరాశి వారికి సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేశాడు. దీని కారణంగా ఈ రాశివారికి వృత్తి పరంగా, వ్యక్తగత జీవితంలో బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కర్కాటక రాశిలో సూర్యుని సంచారం కారణంగా ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.  ఉద్యోగాల్లో మార్పులు రావడం వల్ల ప్రమోషన్స్‌ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా జీతాలు పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


తుల రాశి:
సూర్యుడి సంచారం కారణంగా తుల రాశివారికి సమాజికంగా, ఆర్థికంగా లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సంచారం వల్ల కెరీర్‌లో కూడా మంచి లాభాలు కలుగుతాయి. సమాజంలో ఈ రాశివారికి హోదాలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. 


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేశాడు. దీని కారణంగా ఈ రాశివారికి సామాజికంగా, ఆర్థికంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు. ఈ క్రమంలో  మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook