Sun Transit 2024: శని రాశి కుంభం నుంచి సూర్యుడు కదలికలు..ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!
Sun Transit 2024: శని రాశి కుంభం నుంచి సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
Sun Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజుగా సూర్యుడిని పిలుస్తారు. అలాంటి గ్రహం రాశి సంచారం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎంతో ముఖ్యమైన ఈ గ్రహం బృహస్పతి రాశిలోకి త్వరలోనే సంచారం చేయబోతోంది. ఈ సంవత్సరంలోని మార్చి 14 తేది రోజు మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. శని రాశి అయిన కుంభ రాశిలో నుంచి మీన రాశిలోకి ప్రవేశించడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అయితే ఒక సంవత్సరం తర్వాత మీన రాశిలోకి ఈ గ్రహం సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారికి అదృష్టం పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి:
కన్య రాశి వారికి ఈ సూర్యుడి సంచారం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీనరాశిలో సూర్యుడు ప్రవేశం చేయడం వల్ల వ్యాపారాలు చేసేవారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా ఈ నెలలో నెరవేరుతాయి. అలాగే వీరు విదేశి ఒప్పందులు చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. జీవిత భాగస్వామితో వస్తున్న సమస్యలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు సూర్యుడి అనుగ్రహం లభించి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
వృషభ రాశి:
సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ సమయంలో చాలా ముఖ్యమైన పనులు కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరు పిల్లల నుంచి కూడా ఊహించని శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి:
కుంభ రాశి నుంచి సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా వీరికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి