Sun Transit 2024 In Telugu: అన్ని గ్రహాలకు సూర్యగ్రహం పాలకుడుగా వ్యవహరిస్తాడు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి దాదాపు ఒక నెల సమయం పడుతుంది. ఈ గ్రహం ప్రతినెల ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే సూర్యగ్రహం అతి త్వరలోనే మరో రాశిలోకి సంచారం చేయబోతోంది. ప్రస్తుతం ఈ గ్రహం వృషభ రాశిలో సంచార దశలో ఉంది. అయితే జూలై 15వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించబోతోంది. గతంలో జూన్ 15వ తేదీన ఈ గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించగా దాదాపు నెల వ్యవధిలోనే మిధున రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో వారు విపరీతమైన ధన లాభాలు పొందడమే కాకుండా సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. జూలై 15వ తేదీన ఈ సూర్యగ్రహం మిథున రాశిలోకి సంచారం చేయడం కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారికి ఇక లాభాలే..
మిధున రాశి: 

జూలై 15వ తేదీన సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా పనులలో వస్తున్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో తండ్రి సపోర్టు లభించి చేయలేని పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. అయితే వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం ఎంతో మంచిది లేకపోతే, చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఈ రాశి వారికి మతపరమైన పనులపై ఆసక్తి కూడా పెరుగుతుంది.


సింహరాశి:
సింహ రాశి వారికి సూర్యుడి సంచారం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి జూలై 15వ తేదీ నుంచి శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అదృష్టం సహకరించడం కారణంగా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే గతంలో ఉన్న కోర్టు కేసుల్లో కూడా సులభంగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మీ పూర్తి దృష్టిని మీపై ఉంచడం వల్ల కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీపై మీకు నమ్మకం కూడా పెరిగి మంచి పనులకు దారితీస్తుంది. మీ భాగస్వామితో ఈ సమయంలో మంచి సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. దీంతోపాటు భాగస్వామ్య జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కన్య రాశి: 
సూర్యుడి సంచార ప్రభావం కన్యారాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సమయం ఎంతో శుభ్రంగా ఉంటుంది. అలాగే డబ్బు సంబంధిత సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు గతంలో ఆగిపోయిన పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరే ఛాన్స్ ఉంది. అలాగే వీరు ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం ఎంతో మంచిది. ఈ సమయంలో కన్యా రాశి వారు ఎలాంటి పనులు చేసిన డబ్బులు పొందుతారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి