Sun Transit and Mars set 2023: గ్రహాల రాజైన సూర్యదేవుడు ఇవాళ కన్యారాశిలోకి ప్రవేశించాడు. దీని తర్వాత గ్రహాల కమాండరైన అంగారకుడు కన్యారాశిలో అస్తమించబోతున్నాడు. కన్యారాశిలో భాస్కరుడు సంచారం, కుజుడు అస్తమయం వల్ల కొందరు ఇబ్బందులు పడనున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభం: సూర్యుడి రాశి మార్పు మరియు కుజుడు అస్తమయం మేషరాశి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు కలిసిరావు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 
మీనం: ఈ రాశి వారికి ఈ సమయం అస్సలు అనుకూలంగా ఉండదు. మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. ఆచితూచి మాట్లాడటం మీకే మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. పనులన్నీ ఆగిపోతాయి. 
మేషం: సూర్య సంచారం మేషరాశి వారికి సమస్యలను కలిగిస్తుంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీపై శత్రువులపై విజయం సాధిస్తారు. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇతరులతో సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. 
తుల: సూర్యుడు, కుజుడు గమనంలో మార్పు తులరాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ప్లానింగ్ లేకుండావ్యాపారాన్ని ప్రారంభిస్తే మీరు నష్టపోయే అవకాశం ఉంది. పొదుపు చేయడం అలవరచుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. 


Also Read: Rajyogam: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులకు కావాల్సినంత డబ్బు.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook