Surya Rashi Parivartan 2022:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు నెలకొకసారి రాశిని మారుస్తాడు. ఈ విధంగా వారు మొత్తం 12 రాశిచక్ర గుర్తులలో సంవత్సరం మెుత్తం సంచరిస్తాడు. రేపు అంటే జూన్ 15, 2022న సూర్యుడు మిధునరాశిలోకి (Sun Transit in Gemini 2022) ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం గ్రహాల రాజు అయిన సూర్యుడు శుక్రునికి చెందిన వృషభ రాశిలో ఉన్నాడు. సూర్యుడు ధైర్యం, విజయం, ఆత్మవిశ్వాసం, ప్రతిష్ట, ఆరోగ్యానికి సంకేతుడు. వ్యక్తి యెుక్క జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే.. అతడు కెరీర్ లో పురోగతి ఉంటుంది. మిథునరాశిలోకి సూర్యుని ప్రవేశం ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus) - సూర్య సంచారం వల్ల వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి అందుతుంది. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా మంచిది. అతని పని విజయవంతం అవుతుంది. 


సింహం (Leo)- సూర్యుడు సింహ రాశికి అధిపతి. సింహ రాశి వారికి సూర్యుని రాశి మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గౌరవం పెరుగుతుంది. మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. 


మకరం (Capicron) - మకర రాశి వారికి మిథునంలోని సూర్యుని ప్రవేశం కార్యాలయంలో బలమైన ప్రయోజనాలను తెస్తుంది. మీరు ధైర్యం మరియు విశ్వాసంతో నిండి ఉంటారు. దీనితో మీరు ప్రతి పనిని చక్కగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పాత అప్పుల భారం తీరుతుంది. వివాదాస్పద కేసులో విజయం సాధిస్తారు.


కుంభ రాశి (Aquarius) - సూర్య సంచారం కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ ముగుస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో నవ్వుల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. మొత్తం మీద ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Rahu Remedies: రాహు అనుగ్రహాం పొందాలంటే.. ఈ సింపుల్ పరిహారాలు చేయండి! మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook