Sun Transit August 2022 Effect: గ్రహాల రాజు సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఈ నెల 17తేదీ ఉదయం 07:27 గంటలకు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి (Sun Transit In Leo 2022) ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశిచక్ర గుర్తులపై ఉంటుంది. అయితే సింహరాశిలో సూర్యుడి సంచారం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. వీరు అపారమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆగష్టు నెలలో సూర్యుని సంచారం ఏ రాశి వారికి కలిసి రానుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer)- కర్కాటక రాశి వారికి సింహరాశిలో సూర్యుని ప్రవేశం శుభప్రదం కానుంది. ఈ రాశివారు ఇతరులతో మృదువుగా మాట్లాడటం వల్ల లాభపడతారు. సీనియర్లతో సంబంధాలు లాభిస్తాయి. జాబ్ మారే అవకాశం ఉంది. కొత్త జాబ్ వస్తుంది. ఎక్కడైనా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి మీ వద్దకు వస్తుంది. 


తుల రాశి (Libra)- ఆగష్టు నెలలో సూర్యుని మార్పు తుల రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తుల ఆదాయం భారీగా పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. వ్యాపారుల భారీగా లాభాలను ఆర్జిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.  


వృశ్చిక రాశి (Scorpio)- సూర్య సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి శుభవార్త వింటారు. ముఖ్యంగా వీరి కెరీర్లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్ వస్తుంది. కొత్త జాబ్ సాధిస్తారు.  ఆఫీసులో ప్రశంసలు అందుతాయి. ఓవరాల్‌గా ఈ సమయం ప్రతి విషయంలోనూ కలిసి వస్తుంది.


Also Read: Deepawali 2022: ఈ సంవత్సరం దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook