Sun Transit 2022: సూర్యుడి సింహరాశి ప్రవేశం... ఈ రాశులకు అపారమైన ప్రయోజనం!
Sun Transit 2022: సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి వెళ్లడాన్ని సంక్రాంతి అంటారు. ఈరోజు ఆగస్టు 17న సూర్యుడు కర్కాటక రాశిని వదిలి సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Sun Transit Effect 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు ప్రతి వ్యక్తి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి నెలా సూర్యుడు తన రాశిని మారుస్తాడు. ఇవాళ అంటే ఆగస్టు 17న సూర్యుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశించాడు. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించిన వెంటనే కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి. గ్రహాల రాజు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడాన్ని సింగ్ సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.
మేషరాశి (Aries)- సూర్యుని సంచారం మేషరాశి ప్రజలందరికీ శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయం విద్యార్థులకు బాగుంటుంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. ఆఫీసుల సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది.
కర్కాటకం (Cancer)- సూర్యుడు సంచారం కర్కాటక రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది.
సింహరాశి (Leo)- సూర్యుడి ఈ రాశిలోకే ప్రవేశించడం వల్ల వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా, వ్యాయామం చేయడం మంచిది.
మీనం (Pisces)- సూర్యుని యొక్క ఈ సంచారం వల్ల మీన రాశివారి ఆరోగ్యం మెరుగుపడింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Hala Shashthi Vratam: హాల షష్టి వ్రతం అంటే ఏమిటి? దీని పూజా విధానం తెలుసుకోండి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook