Surya Rashi Parivartan 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. రీసెంట్ గా సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. దీనినే కన్యా సంక్రాంతి అంటారు. సూర్యుడు అక్టోబరు18 వరకు కన్యారాశిలో ఉండి ఆ తర్వాత తులరాశిలోకి ప్రవేశిస్తాడు. తుల రాశిలో సూర్యుడి సంచారం (Sun Transit in Libra 2022) కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. అక్టోబరు 18 తర్వాత ఈ రాశులవారి అదృష్టం మారనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): అక్టోబర్ 18న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మేషరాశివారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ రాశివారు అనేక సమస్యల నుండి విముక్తి పొందుతారు. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. 


కర్కాటకం(Cancer): సూర్య రాశి మార్పు కర్కాటక రాశికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే అక్టోబర్ 18 తర్వాత దాని నుండి ఉపశమనం పొందుతారు. ఈ రాశి మార్పు మీ ఉద్యోగ, వృత్తి రంగంలో పెను మార్పులను తీసుకొస్తుంది. 


తుల రాశి (Libra): ఈ రాశిలోనే సూర్యుని సంచారం జరుగుతుంది కాబట్టి తులరాశి వారి జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. వీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభాలను  ఆర్జిస్తారు. ఈ సమయంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. 


వృశ్చిక రాశి (Scorpio): సూర్య రాశి మార్పు వృషభ రాశిపై చాలా శుభప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారి జీవితంలో ఆదాయానికి సంబంధించిన కొత్త మార్గాలు తెరవబడతాయి. 


ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి యొక్క పదో ఇంట్లో సూర్య సంచారం జరుగబోతుంది. కాబట్టి ఇది ఈ రాశవారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 


మకరరాశి (Capricorn): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మకరరాశిలో తొమ్మిదో రాశిలో సూర్యుడి సంచారం జరుగుతుంది. ఈ రాశివారికి ధనం లాభదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. అయితే ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.. లేకుంటే నష్టాలను చవిచూడాల్సి రావచ్చు.


Also Read: Mahalaya Amavasya 2022: సెప్టెంబరు 25న అరుదైన యోగం.. ఈరాశులవారికి లక్కే లక్కు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook