Sun Transit 2023: గ్రహాల రారాజుగా భావించే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించాడు. దీనినే ధన సంక్రాంతిగా పిలుస్తారు. ఫలితంగా నెలరోజుల వరకూ కొన్ని రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. అంతులేని లాభాలు అందనున్నాయి. ఏయే రాశులకు ధన సంక్రాంతి లబ్ది చేకూర్చనుందనే వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. గ్రహాల కదలిక లేదా రాశి పరివర్తనం వల్ల మిగిలిన రాశులపై ప్రభావం పడుతుంటుంది. సూర్యుడి గోచారానికి విశేషం ఉంది. సూర్యుడి ధనరాశిలో ప్రవేశించాడు. సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నసమయంలో ఏ విధమైన శుభ కార్యక్రమాలు నిర్వహించరు. డిసెంబర్ 16 రాత్రి నుంచి జనవరి 15వ తేదీ 2024 వరకూ ఇదే పరిస్థితి. అయితే మూడు రాశులవారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని సాహసం, ప్రతిభ, నాయకత్వం, గౌరవం, శక్తి, ఆత్మ విశ్వాసం, విజయం, తండ్రి, ప్రతిష్ఠ, యజమాని వంటి అంశాలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే సూర్యుడి గోచారంతో ఈ అంశాలపై ప్రభావం పడుతుందని నమ్మకం. 


సింహ రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనంతో చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులకు విజయం సిద్ధిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది. పెళ్లికానివారికి పెళ్లి నిశ్చయం కావచ్చు. సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఇక ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లేదా పదోన్నతి లాభిస్తుంది. వ్యాపారులకు అంతులేని లాభాలు కలుగుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 


ధనస్సు రాశి జాతకులకు మరింత ప్రయోజనం కలగనుంది. ఎందుకంటే సూర్యుడు ఈ రాశిలోనే ఉంటాడు. ధనస్సు రాశిలో సూర్యుడు ఊహించని లాభాలు అందించనున్నాడు. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. వృత్తిపరమైన జీవితంలో ఎదుగుదల కన్పిస్తుంది. డబ్బు సంపాదించేందుకు అద్భుతమైన అవకాశాలుంటాయి. దాంతోపాటు గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలుంటాయి. ఊహించని ధన సంపద లాభిస్తుంది. ఆర్ధికంగా ఎలాంటి సమస్య ఎదురుకాదు. 


మేష రాశి జాతకులకు అంతా అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో ఆనందం కలగవచ్చు. విదేశీ ప్రయాణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలవైపు ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయానికి కొత్త మార్గాలు కూడా తెర్చుకుంటాయి. 


Also read: Guru Gochar 2024: పుష్కర కాలం తర్వాత వృషభరాశిలోకి బృహస్పతి.. ఈ 3 రాశులకు ధనప్రాప్తి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook