Sun transit 2023: సూర్యుడి ధనస్సు రాశి ప్రవేశం, ఈ 4 రాశులకు జనవరి 15 వరకూ గడ్డుకాలమే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Sun transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యముంటాయి. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశి ప్రవేశం కారణంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం కన్పించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు రాశి మారడాన్ని సంక్రాంతిగా అభివర్ణిస్తారు. రేపు అంటే డిసెంబర్ 16 నుంచి సూర్యుడి ధనస్సు రాశిలో ప్రవేశిస్తుండటం కారణంగా కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడనుంది. జనవరి 16 వరకూ అదే పరిస్థితి కొనసాగనుంది.
గ్రహాల నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశి ప్రవేశం చేస్తున్నట్టే సూర్యుడు కూడా రాశి మారుతుంటాడు. సూర్యుడు మాత్రం నెలకోసారి రాశి మారుతుంటాడు. హిందూమతంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. డిసెంబర్ 15 అంటే రేపు సాయంత్రం 4.14 గంటలకు సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించనున్నాడు. అందుకే ఈ నెలరోజుల సమయాన్ని ధన సంక్రాంతిగా పిలుస్తారు. ధన సంక్రాంతి ముగియగానే మకర సంక్రాంతి ప్రారంభమౌతుంది. ధన సంక్రాంతి నేపధ్యంలో కొన్ని రాశులవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలరోజులు చాలా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
కన్యా రాశి జాతకులకు నెలరోజులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో అనవసర విషయాల్లో గొడవలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉంటే నివారించవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులు తీసుకునే నిర్ణయాల పట్ల ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఆర్ధికంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి జాతకులు సూర్యుడు ధనస్సులో ఉన్నంతవరకూ ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాట అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమకు అప్పగించిన పనిని జాగ్రత్తగా పూర్తి చేసి అంతవరకే పరిమితం కావాలి. లేని సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండాలి. వ్యాపారుల మరింత జాగ్రత్తగా ఉండాలి.
జ్యోతిష్యం ప్రకారం డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకూ మిధున రాశి జాతకులుకు కాస్త గడ్డుకాలమే ఎదురుకానుంది. ఎవరితోనూ అనవసరంగా తగాదా పడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. తోటి ఉద్యోగులు లేదా సహచర సిబ్బందితో సత్సంబంధాలు కలిగి ఉండటం మంచిది. పనిచేసే చోట సంయమనం పాటిస్తే ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవచ్చు. ఆరోగ్య విషయాల్లో కేర్ తీసుకోవాలి. ఆర్ధికంగా క్లిష్టమైన సమయం.
ఇక చివరిగా కర్కాటక రాశి జాతకులు కుటుంబసభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. వ్యాపారంలో మార్పులు లేదా పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఈ నెల ఆగిపోవడం మంచిది. వచ్చేనెలలో అంటే సూర్యుడి తిరికి మకరంలో ప్రవేశించాక చేసుకోవడం మంచిది. ఉద్యోగులు కూడా పనిచేసే చోట కాస్త సంయమనంగా ఉండటం అలవర్చుకోవాలి. ఇతరులతో గొడవలు పడకూడదు. ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook