Sun Transit 2022: సూర్యుడి రాశి పరివర్తనం రేపే. అంటే ఆగస్టు 17 నుంచి అన్ని రాశులపై ప్రభావం పడనుంది. కొన్ని రాశులకు మాత్రం రేపట్నించి అంతా శుభమే జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాలకు రారాజుగా భావిస్తారు. అందుకే సూర్యుడి రాశి పరివర్తనం దాదాపు అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడి ప్రతి నెలా రాశి మారుతుంటాడు. దీనినే గ్రహ గోచారం లేదా రాశి గోచారంగా పిలుస్తారు. సూర్యుడి రాశి మారడం కొన్ని రాశులపై శుభసూచకంగా ఉంటుంది. కొన్ని రాశులకు మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. రేపు అంటే ఆగస్టు 17న సూర్యుడు రాశి మారనున్నాడు.


సూర్య గోచారం ఆగస్టు 17 ఉదయం 7 గంటల 37 నిమిషాలకుంటుంది. ఈసారి సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలో ప్రవేశిస్తాడు. అక్టోబర్ 17 వరకూ ఇదే రాశిలో ఉండనున్నాడు. సూర్య గోచారం కారణంగా కొన్ని రాశుల జాతకమే మారిపోనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం..


వృషభరాశివారికి సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం శుభం కల్గిస్తుంది. అంటే ఆగస్టు 17 నుంచి వృషభరాశి జాతకుల అదృష్టం మారిపోనుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయవచ్చు. సంపద కూడబెట్టుకుంటారు. పనిచేసే చోట సాఫల్యంతో పాటు గౌరవ మర్యాదలు లభిస్తాయి.


సింహరాశికి సూర్యుడి గురువు. ఈసారి సూర్య గోచారం సింహరాశిలో కానుండటంతో సింహరాశివారి జీవితంలో పెనుమార్పులు రానున్నాయి. అంతా శుభం జరగనుంది. ఉద్యోగం చేసేవారికి అభివృద్ధి కలుగుతుంది. అటు వ్యాపారస్థులకు అధికలాభాలు కలుగుతాయి. ధన సంపదలు వస్తాయి.


కన్యారాశివారిపై కూడా పూర్తి అనుకూలంగా ఉంటుంది. విదేశీయాత్రలు చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రగతి కన్పిస్తుంది. ధనలాభం ఉంటుంది. 


ధనస్సురాశివారి జీవితంలో కీలకమార్పు వస్తుంది. ధనస్సురాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. దాంతోపాటు ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి.


ఇక చివరిగా సూర్య గోచారం కారణంగా కుంభరాశివారి జీవితంలో అనుకూల మార్పులు సంభవిస్తాయి. ఈ జాతకులకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.


Also read: Janmashtami 2022 Remedies: జన్మాష్టమి రోజున ఇలా చేస్తే..అంతులేని ధన సంపదలు, సంతానం మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook