Sun transit 2022: సూర్యుడి కర్కాటక ప్రవేశం, జూలై 16 నుంచి ఆ రాశివారికి అన్నీ కష్టాలే
Sun transit 2022: సూర్యుడు జూలై 16వ తేదీ నుంచి కర్కాటకరాశిలో ప్రవేశించనున్నాడు. చంద్రుడి ఇంట్లో ఓ నెలపాటు విరాజిల్లనున్నాడు. సూర్యుడి ఈ కదలిక వృశ్చిక రాశిపై ప్రభావం పడనుంది.
Sun transit 2022: సూర్యుడు జూలై 16వ తేదీ నుంచి కర్కాటకరాశిలో ప్రవేశించనున్నాడు. చంద్రుడి ఇంట్లో ఓ నెలపాటు విరాజిల్లనున్నాడు. సూర్యుడి ఈ కదలిక వృశ్చిక రాశిపై ప్రభావం పడనుంది.
గ్రహాల కదలికలు, రాశి మారడం ఇతర రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. సూర్యుడు జూలై 16 నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. ఫలితంగా 12 రాశులపై ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. సూర్యుడి గోచారం ప్రభావం వృశ్చిక రాశివారిపై ఎలా ఉంటుందో పరిశిలిద్దాం..
వృశ్చికరాశి జాతకులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సి ఉంటుంది. వివిధ రోగాలతో ఇబ్బంది పడేవాల్లు..మందుల్ని సకాలంలో తీసుకుంటూ ఉండాలి. అయినా తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మరే ఇతర వ్యాధి లక్షణాలున్నాయో లేదో పరిశీలించుకోవడం మంచిది. మొత్తానికి ఈ రాశి ప్రజలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం ఏ మాత్రం మంచిది కాదు. దాంతోపాటు యోగా, వ్యాయామం చేస్తుండాలి. ఆరోగ్యం ప్రభావం మీ ముఖంపై కూడా కన్పిస్తుంది. దేవుడిని ఆరాధిస్తూ రోగ నివారణకై ప్రార్ధనలు చేస్తే కాస్త హాయిగా ఉంటుంది.
చేసేది ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆదాయమార్గంపై ఏ మాత్రం ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే సూర్యుడి కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల వృశ్చికరాశివారి ఆదాయం ప్రభావితమౌతుంది. ఈ విషయమై ఏ విధమైన ఆందోళన అనవసరం. డబ్బుల లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఆర్దికంగా నష్టపోతారు. ఈ సమయంలో ఏ కారణం లేకుండానే డబ్బులు నష్టపోవచ్చు. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా..నష్టం నుంచి కాపాడుకోవచ్చు.
కుటుంబం, బంధువులు, ఇరుగుపొరుగు, మిత్రుల మధ్య ఉన్నప్పుడు సంయమనంతో ఉండాలి. ఎవరిపైనైనా ఏదైనా భ్రమలుంటే వెంటనే తొలగించుకోవాలి. ఏదైనా విషయమై..మీరు ఇనీషియేటివ్ తీసుకోవద్దు. ఎందుకంటే మీపై ఎవరైనా అబద్ధపు ఆరోపణలు చేయవచ్చు. ఫలితంగా లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారు.
మీ కంటే పెద్దవాళ్లు, మిత్రులు, సోదరులతో మంచి సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించండి. ఎప్పుడూ మీ అంతట మీరుగా వారిని కలవడం, కుశల సమాచారం తెలుసుకోవడం చేయాల్సి ఉంటుంది. లేకపోతే గ్రహం శత్రుత్వాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఏదైనా పని చేసేముందు అన్ని రకాలుగా ఆలోచించి..పూర్తి ఏర్పాట్లు చేసుకునే చేయాలి. తద్వారా ఆ పనిలో విజయం లభిస్తుంది. ఒకవేళ విజయం లభించకపోయినా నిరాశ చెందవద్దు. ఎందుకంటే ఏదైనా పని తలపెట్టినప్పుడు గెలుపోటములు సహజమే. ప్రతిసారీ విజయం లభించాలని లేదు.
Also read: Shani Transit: నేడు మకర రాశిలోకి శని ప్రవేశం... ఈ 3 రాశుల వారికి ఇక అంతా శుభమే...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook