Sun Transits in Aquarius: సూర్య భగవానుడు ఈ నెల 13, తెల్లవారుజామున 3.28 గంటలకు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్చి 14 వరకు కుంభ రాశిలోనే సంచరించనున్నాడు. సూర్యుడు ఇలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సూర్య సంక్రాంతిగా పిలుస్తారు. ప్రతీ సూర్య సంక్రాంతికి ఆయా రాశులపై దాని ప్రభావం  ఉంటుంది. ఈసారి సూర్య సంక్రాంతికి కూడా పలు రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావం పడనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం - ARIES


సూర్యుడు పదకొండో స్థానంలో సంచరించనున్నాడు. జన్మరాశిలో పదకొండో స్థానం ఆదాయానికి, కోరికలు నెరవేరేందుకు సంకేతం లాంటిది. సూర్యుడు ఇలా పదకొండో స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నెరవేరని కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయి. సూర్యుడి సంచారం మీపై సానుకూలంగా ఉండాలంటే... నిద్రకు ఉపక్రమించే సమయంలో తల భాగం వద్ద ఐదు బాదం పప్పులు ఉంచాలి. మరుసటి రోజు ఆ ఐదు బాదం పప్పులను ఏదేని ఆలయంలో దానమివ్వాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.


వృషభ రాశి - TAURUS


సూర్యుడు పదో స్థానంలో సంచరించనున్నాడు. పదో స్థానం తండ్రికి, రాష్ట్రానికి సంబంధించినది. సూర్యుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు మీకు రాష్ట్రం ద్వారా కలిగే ప్రయోజనాలు నెరవేరుతాయి. అలాగే మీ తండ్రికి సంబంధించిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీకు, మీ తండ్రికి ఇది పూర్తిగా అనుకూల సమయంగా మారాలంటే.. మార్చి 14 వరకు, ఎప్పుడు ఇంటి నుంచి బయటకెళ్లినా తలను వస్త్రంతో కవర్ చేసుకోవాలి.


మిథున రాశి - Gemini


సూర్యుడు తొమ్మిదో స్థానంలో సంచరించనున్నాడు. జన్మరాశిలో తొమ్మిదవ స్థానం అదృష్టానికి సంబంధించినది. సూర్య భగవానుడు తొమ్మిదో స్థానంలో సంచరించడం ద్వారా మీకు అదృష్టం కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మార్చి 14 వరకు మీరు ఏ పని చేసినా, అది కచ్చితంగా సమయానికి పూర్తి అవుతుంది, అలాగే మీ పనిలో సంతృప్తిని పొందుతారు. మార్చి 14 వరకు అదృష్టాన్ని మీతో ఉంచుకోవడానికి.. ఇంట్లో ఇత్తడి పాత్రలను ఉపయోగించండి. అలాగే ఇత్తడి పాత్రలను ఎవరికీ దానమివ్వొద్దని గుర్తుంచుకోండి.


కర్కాటక రాశి - Cancer 


సూర్యదేవుడు ఎనిమిదో స్థానంలో సంచరించనున్నాడు. జన్మరాశిలో ఎనిమిదో స్థానం ఆరోగ్యానికి సంబంధించినది. సూర్య భగవానుడి ఈ సంచారం కారణంగా..  కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మార్చి 14 వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మార్చి 14 వరకు సూర్యదేవుని కృపతో ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే నల్ల ఆవుకు సేవ చేయాలి. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా మీ పెద్దన్నయ్యకు సాయం చేయాలి.


సింహ రాశి - LEO



సూర్యుడు ఏడో స్థానంలో సంచరించనున్నాడు. జన్మరాశిలో సప్తమ స్థానం జీవిత భాగస్వామికి సంబంధించినది. సూర్యభగవానుని ఈ సంచారము వలన, మీరు మీ జీవిత భాగస్వామి మద్దతును పొందడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో, మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు. మార్చి 14 వరకు మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించడానికి.. మీ ఆహారంలో కొంత భాగాన్ని ఇతరులకు దానం చేయండి.


కన్య - Virgo


సూర్యుడు ఆరో స్థానంలో సంచరించనున్నాడు. జన్మరాశిలో ఆరో స్థానం స్నేహితులకు సంబంధించినది. సూర్య భగవానుడి ఈ సంచారం మీ స్నేహితుల సంఖ్యను పెంచుతుంది. మీ స్నేహితులు మీకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరులు వచ్చి మీతో చేరాలని కోరుకుంటారు. మార్చి 14 వరకు మిత్రులతో సత్సంబంధాలు నెలకొనాలంటే గుడికి మినుములు దానం చేయండి.


తుల -  Libra


సూర్యుడు ఐదో స్థానంలో సంచరిస్తాడు. జాతకంలో ఐదవ స్థానం అభ్యాసం, గురువు, విచక్షణ, పిల్లలు, ప్రేమకు సంబంధించినది. సూర్య భగవానుడి ఈ సంచార ప్రభావం కారణంగా, మీ దృష్టి చదువుల నుండి మళ్లించబడవచ్చు. మీరు మీ చదువులపై దృష్టి పెట్టాలి. మీరు మీ గురువుతో మంచి సంబంధాలను కొనసాగించాలి. దీనితో పాటు, మీరు పిల్లలతో సంబంధంపై కూడా శ్రద్ధ వహించాలి. కాబట్టి, మార్చి 14 నాటికి, మీ పరిస్థితి అన్ని విధాలుగా మెరుగుపడేందుకు చిన్న పిల్లలకు ఏదైనా బహుమతిగా ఇవ్వండి.


వృశ్చిక రాశి - Sagittarius


సూర్యుడు నాలుగో స్థానంలో సంచరించనున్నాడు. జన్మరాశిలో నాలుగో స్థానం తల్లి, భూమి, భవనం, వాహనానికి సంబంధించినది. సూర్య భగవానుని ఈ సంచారము వలన తల్లి మద్దతును పొందుతారు, అలాగే భూమి, భవనం, వాహనం ద్వారా లాభాన్ని పొందుతారు. కాబట్టి, మార్చి 14 వరకు ఈ లాభాన్ని పొందేందుకు.. ఆలయంలో బెల్లం దానం చేయండి.


ధనుస్సు రాశి - Capricorn 


సూర్యడు మూడో స్థానంలో సంచరించనున్నాడు. జన్మరాశిలో మూడో స్థానం తోబుట్టువులు, అభివ్యక్తికి సంబంధించినది. సూర్యభగవానుని ఈ సంచారంతో, మీ సోదరులు, సోదరీమణుల మద్దతును పొందుతారు. ఇతరుల ముందు మీ మాటలను బాగా వ్యక్తీకరించగలరు. మార్చి 14 వరకు సోదరులు, సోదరీమణులతో సత్సంబంధాలు కొనసాగేందుకు.. సూర్య దేవుని మంత్రాన్ని జపించాలి. మంత్రం - ఓం ఘృణి: సూర్యాయ నమః.


మకరం - Capricorn


సూర్యదేవుడు మీ రెండవ స్థానంలో సంచరిస్తాడు. జన్మరాశిలో రెండవ స్థానం సంపదకు సంబంధించినది. ఇది మీ ఆర్థిక స్థితికి సంబంధించినది. సూర్యభగవానుని ఈ సంచారం నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి మీరు కొంచెం కష్టపడాల్సి రావొచ్చు. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.  మార్చి 14 వరకు మీకు శుభం కలగాలంటే.. ఆలయంలో కొబ్బరి నూనెను దానం చేయాలి.


కుంభం - Aquarius


సూర్యుడు మీ మొదటి స్థానంలో సంచరించనున్నాడు. జన్మరాశిలో మొదటి స్థానం మీ శరీరం, మీ ప్రేమ, మీ గౌరవానికి సంబంధించినది. సూర్య భగవానుడి ఈ సంచారంతో, మార్చి 14 వరకు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ప్రేమించేవారితో సంబంధాలు బలంగా ఉంటాయి, అలాగే మీ గౌరవం పెరుగుతుంది. ఇది కాకుండా, మార్చి 14 నాటికి మీ పిల్లలు కోర్టు పనిలో విజయం సాధిస్తారు. మార్చి 14 వరకు జీవితంలో అంతా శుభం కలిగేందుకు సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.


మీన రాశి - Pisces


సూర్య దేవుడు మీ 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో 12వ స్థానం మంచం, ఆనందం, వ్యయానికి సంబంధించినది. ఈ సూర్యభగవానుని సంచారము వలన మీరు పడక సుఖం పొందుతారు.  మీ ఖర్చులు పెరగవచ్చు. అనవసరమైన వాటిపై డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలి. సూర్య భగవానుడి కృపను కొనసాగించడానికి మీరు మతపరమైన పనులలో సహకరించాలి. అలాగే ఉదయాన్నే మీ ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. తద్వారా సూర్య భగవానుడి శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.


Also Read : Polytechnic Question Papers Leak: పాలిటెక్నిక్ క్వ‌శ్చ‌న్ పేపర్స్ ముందే లీక్... వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోన్న ప్రశ్నాపత్రాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook