Sun transits in Pisces 2022 : సౌర వ్యవస్థలోని గ్రహాల సంచారంలో చిన్న మార్పు జరిగినా.. అది రాశిచక్రంలోని అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. గ్రహ సంచారంలో సూర్య సంచారం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెల 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మీనం సూర్యునికి అనుకూలమైన రాశి చక్రం. మీనంలోకి సూర్యుని సంచారం జరిగిన ఆరు రోజులకు ప్రధానంగా 4 రాశుల వారికి ప్రయోజనం చేకూర్చనుంది. ఆ నాలుగు గ్రహాలు ఏంటో.. వాటికి కలిగే ప్రయోజనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం: సూర్యుడు 11వ స్థానంలో సంచరిస్తాడు. ఈ కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. సూర్య సంచార ప్రయోజనాన్ని పొందేందుకు.. ఆదివారం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మంచపై రెండు ముల్లంగిని ఉంచండి. మరుసటిరోజు వాటిని ఆలయంలో దానం చేయండి.


మిథునం : సూర్యుడు మిథునంలో 10వ ఇంట్లో సంచరిస్తాడు. సూర్యుని సంచారంతో ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశం కలుగుతుంది. లేదా పదోన్నతి పొందుతారు. మీరు చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులు బాగా డబ్బు సంపాదించగలరు. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వారికి పెద్ద పదవులు దక్కే అవకాశం ఉంది. వచ్చే 30 రోజులు నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం మానేయండి. 


కర్కాటక రాశి: కర్కాటకంలో సూర్యుడు తొమ్మిదో ఇంట్లో సంచరిస్తాడు. తద్వారా ఈ రాశి వారికి అన్ని విధాలా అదృష్టం కలిసొస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత ఉంటుంది. ఏప్రిల్ 14 వరకు ఇంట్లో ఇత్తడి పాత్రలు ఉపయోగిస్తే శుభం కలుగుతుంది. ఒకవేళ ఇంట్లో ఇత్తడి పాత్రలు లేకపోతే మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఉపయోగించవచ్చు.


ధనుస్సు: ధనుస్సు రాశిలో సూర్యుడు నాలుగో ఇంట్లో సంచరిస్తాడు. తద్వారా ఈ రాశి వారికి అన్ని విధాలా అదృష్టం కలిసొస్తుంది. డబ్బు, భూమి, వాహనాలు, కొత్త వస్తువులు ఇలా ప్రతీది చేకూరుతుంది. మీ పిల్లలు కూడా ఆర్థికంగా వృద్దిలోకి వస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా మీకు శుభం కలుగుతుంది. 


(గమనిక: ఇక్కడ అందించిన వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE మీడియా దీనిని ధృవీకరించలేదు.)