Sun will Enter Aries on 14th April 2023:  ఏప్రిల్ నెలలో చాలా శుభకరమైన యాదృచ్చికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని పెద్ద గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈనెల 14న సూర్యభగవానుడు మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది జరిగిన ఆరు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, కుంభం, వృశ్చికం సహా ఏడు రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. కుంభం
సూర్యగోచార సమయంలో ధన ధాన్య లాభం ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. బిజినెస్ పెరుగుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది. మిమ్మల్ని అనారోగ్యం దరిచేరదు. 


2. ధనుస్సు
ధనుస్సు రాశి వారికి సూర్యుని సంచారం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. డబ్బు దుబారా తగ్గుతుంది. మీకు సమయం సూపర్ గా ఉంటుంది. 


3. వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా మునుపటి కంటే బలపడతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. 


4. సింహం
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, సింహ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 


Also Read: Mangal Budh Gochar 2023: కుజ-బుధ గ్రహాల రాశి మార్పు యోగం.. ఈ రాశుల వారికి అపారమైన సంపద!


5. కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. తద్వారా మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బును ఆదా చేస్తారు. 


6. మిథునం
మిథున రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగుల జీతం రెట్టింపు అవుతుంది. వ్యాపారుల ఆర్థికంగా లాభపడతారు. ధనలాభం  కూడా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరతాయి. 


7. మేషం
మేషరాశి వారికి సూర్యుడి రాశి మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ప్రమోషన్ కూడా వస్తుంది. బిజినెస్ విస్తరిస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 


Also Read: April Horoscope 2023: ఈనెలలో రాశిని మార్చబోతున్న గ్రహాలు, దశ తిరగనున్న రాశులివే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook