Budhaditya Rajyog In Capricorn 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఇది మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి ప్రారంభంలో మకరరాశిలో చాలా శుభప్రదమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల అరుదైన బుధాదిత్య రాజయోగం  ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా లాభపడటంతోపాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య-బుధ సంయోగం ఈ రాశులకు శుభప్రదం


ధనుస్సు (Sagittarius): బుధాదిత్య రాజయోగం ఏర్పడటం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీడియా, ఫిల్మ్ లైన్, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు దుస్తుల వ్యాపారం చేసేవారు ఈ సమయంలో లాభం పొందుతారు. 


మీన రాశిచక్రం (Pisces): బుధాదిత్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీ ఆదాయం విపరీతం పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభం పొందుతారు. రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తికి మంచి పదవి దక్కే  అవకాశం ఉంది. 


వృషభ రాశి (Taurus): బుధాదిత్య రాజయోగం ఏర్పడిన వెంటనే మీ మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీకు ప్రతి పనిలోనూ లక్ కలిసి వస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు తమ కోరికలను నెరవేర్చుకుంటారు. పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వృషభరాశి వ్యక్తులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. 


Also Read: Budh Gochar 2023: జనవరి 13న ఉదయించబోతున్న బుధదేవుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలే కష్టాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.