Mercury transit 2023: వృషభరాశిలో గ్రహాల రాజు, యువరాజు కలయిక.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..
Budhaditya Raja Yoga: వృషభరాశిలో సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల శుభప్రదమైన బుదాదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Gochar 2023: జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. నిన్న అంటే జూన్ 07న సాయంత్రం 07:45 గంటలకు గ్రహాల యువరాజు బుధుడు శుక్రుని రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో గ్రహాల రాజు సూర్యుడు సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. వృషభరాశిలో జూన్ 19న బుధుడు అస్తమించనునన్నాడు. అనంతరం జూన్ 24న మిథునరాశిలోకి వెళ్తాడు. బుధాదిత్య రాజయోగం ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందా తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగం ఈ రాశులకు వరం
వృషభం: ఇదే రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి వరమనే చెప్పాలి. వృషభరాశి వారు భారీగా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.
కన్య: మెర్క్యూరీ సంచారం కన్యారాశి వారికి అపారమైన ధనాన్ని ఇస్తుంది. బుధాదిత్య యోగం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆఫీసులో మంచి వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Mangal shukra yuti 2023: కర్కాటక రాశిలో అరుదైన కలయిక.. 7 రాశులకు లాభం.. 5 రాశులకు నష్టం..
సింహ రాశి: ఈ రాశికి అధిపతిగా సూర్యభగవానుడిని భావిస్తారు. బుధాదిత్య యోగం ఈ రాశివారికి కలిసి వస్తుంది. వీరు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Shani Vakri 2023: అరుదైన యోగం చేస్తున్న తిరోగమన శని... ఈ 5 రాశులవారిపై నోట్ల వర్షం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook