Surya Budh Yuti 2023: మిథునంలో బుధ - సూర్య కలయిక.. ఈ 4 రాశులపై నోట్ల వర్షం!
Budh Gochar 2023: మిథునరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని శుభప్రదమైనదిగా భావిస్తారు. బుధాదిత్య రాజయోగం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Surya Budh Yuti 2023 makes Budhaditya Raja Yoga in Mithun Rashi: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తే.. బుధుడిని ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం సూర్యభగవానుడు మిథునరాశిలో కూర్చున్నాడు. నిన్న (జూన్ 24) బుధుడు అదే రాశిలోకి ప్రవేశించాడు. వీరిద్దరి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధుడు మరియు సూర్యుని కలయిక అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. బుధాదిత్య రాజయోగం వల్ల ఏయే రాశులవారు లాభాలు పొందనున్నారో తెలుసుకుందాం.
మేషరాశి
సూర్యుడు మరియు బుధుడి సంయోగం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆఫీసులో సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది.
వృషభం
బుధాదిత్య రాజయోగం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
Also Read: Lucky Zodiac Sign: శ్రావణ మాసంలో లక్కీ రాశులు ఇవే.. మీది ఉందా?
మిధునరాశి
సూర్యుడు మరియు బుధుల కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఖర్చులు తగ్గుతాయి. మీ కుటుంబ సమస్యలు దూరమవుతాయి. పరిశోధన పనుల నిమిత్తం మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్యుడు మరియు బుధుడు సంతోషాన్ని ఇస్తాయి. మీరు పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది. వ్యాపారం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇదే మంచి సమయం. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
Also Read: Budh Gochar 2023: పవిత్రమైన యోగం చేస్తున్న బుధుడు.. ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook