Budh-Surya Yuti Benefits: గ్రహాల కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ, అశుభ యోగాలు చేస్తాయి. వీటి ప్రభావం మనిషి జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం బుధుడు, సూర్యుడు మిథునరాశిలో సంచరిస్తున్నారు. వీరిద్దరి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగంతోపాటు విపరీత లేదా వ్యతిరేక రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ వ్యతిరేక రాజయోగం కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
కర్కాటక రాశి యొక్క మూడవ మరియు బయటి ఇంటికి బుధుడు అధిపతి. పన్నెండవ ఇంట్లో సూర్యునితో కూర్చోవడం వల్ల వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది. దీంతో విదేశాల్లో వ్యాపారం చేసేవారు భారీగా లాభపడనున్నారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సూర్యుడి అనుగ్రహం వల్ల మీరు పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు లాభిస్తుంది. 


వృశ్చిక రాశి
ఈ రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది. మీ జాతకంలో పదకొండవ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి బుధుడు. సూర్యుడు అనుగ్రహం కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ మరియు వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది.


మకరరాశి
విపరీత రాజయోగం మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలో ఆరవ మరియు తొమ్మిదవ ఇంటికి బుధుడు అధిపతిగా భావిస్తారు. సూర్య, బుధుల కలయిక ఆరో ఇంట్లో జరగింది. దీని కారణంగా మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. 


Also Read: Shukra Vakri 2023 : జూలైలో తిరోగమనం చేయబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook