Budhaditya Rajyog: మకరంలో బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..
Budhaditya Rajyog: ఆస్ట్రాలజీ ప్రకారం, మకరరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి.
Budhaditya Rajyog In Makar: వేద జ్యోతిషశాస్త్రంలో బుధాదిత్య రాజ్యయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎవరి జాతకంలో ఈయోగం ఏర్పడుతుందో దానిని అదృష్టంగా భావిస్తారు. వీరు సకల సౌకర్యాలను పొందుతారు. గ్రహాలు ఎప్పటికప్పుడు పొత్తు పెట్టుకోవడం ద్వారా రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ రాజయోగం సూర్యుడు మరియు బుధుల కలయిక వల్ల ఏర్పడింది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ యోగం మకరరాశిలో ఏర్పడింది. దీని ప్రభావం మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మేష రాశిచక్రం (Aries)
బుధాదిత్య రాజయోగం ఏర్పడటం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశితో కర్మ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కోరుకున్న చోటుకి ఉద్యోగులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
కర్కాటక రాశిచక్రం (Cancer)
బుధాదిత్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి సప్తమ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. సూర్య గ్రహ ప్రభావం కారణంగా వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. పార్టనర్ షిప్ తో చేసే పనిలో మంచి విజయాలను సాధిస్తారు. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
వృషభ రాశి (Taurus)
బుధాదిత్య రాజయోగం మీ అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీరు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎగుమతి, దిగుమతి, కాంట్రాక్టు, పరిపాలనా పనులతో సంబంధం ఉన్నవారు ఈ సమయంలో మంచి విజయాన్ని సాధిస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
Also Read: Surya And Jupiter Yuti: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో అరుదైన కలయిక.. ఈ మూడు రాశులకు తిరుగుండదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook