Sun Transit January 2023: మరో 48 గంటల్లో వీరి అదృష్టం మారనుంది... ఇందులో మీరున్నారా?
Sun Transit January 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు శని రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు ఆర్థికంగా మీకు లాభాలను ఇస్తుంది.
Sun Transit January 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యభగవానుడు త్వరలో మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు జనవరి 14న మకరరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని ప్రబావం ప్రజలందరిపై ఉంటుంది. సూర్యదేవుడి సంచారం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు అనుకూలం
మేషం (Pisces): సూర్యుడి సంచారం జనవరి 14 నుండి ఫిబ్రవరి 13 వరకు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడు మకరరాశిలో ఉన్న సమయంలో మేష రాశి వారు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి.
మిథునం(Gemini): మిథునరాశి వారికి సూర్యుని రాశి మార్పు చాలా మేలు చేస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీ లైప్ లో సుఖాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం (Cancer): సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే కర్కాటక రాశి వారు గొప్ప విజయాన్ని పొందుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు లాభం చేకూరుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం ఉంటుంది. జీవితంలో ఆనంంద తాండవిస్తోంది. విద్యార్థులకు ఈ సమయం అదభుతంగా ఉంటుంది.
మీనం (Pisces): సూర్యుని సంచారం మీన రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆగిపోయిన పనులన్నీ ప్రారంభం అవుతాయి. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
Also Read: Shani Asta 2023: సొంత రాశిలోనే శనిదేవుడి అస్తమయం.. ఈ 3 రాశులవారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి