Sun Transit in Aries 2023: ఏప్రిల్ 14 సూర్యుడు మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. దాదాపు నెల రోజులపాటు ఆదిత్యుడు అదే రాశిలో ఉండనున్నాడు. ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో వారు ప్రతి రంగంలోనూ విజయాన్ని పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారు. సూర్యుడి యెుక్క ఈ సంచారం 5 రాశుల వారి జీవితాలలో సంతోషాన్ని నింపుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం
కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారం చాలా మేలు చేస్తుంది. మీరు కెరీర్‌లో రాణిస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఎక్కువగా పొదుపు చేస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. 
సింహరాశి
మేషరాశిలో సూర్యుని సంచారం వల్ల సింహ రాశి వారు తమ వృత్తిలో పురోగతి సాధిస్తారు. మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితం బాగుంటంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. కొత్తగా పెళ్లయిన వారు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
మేష రాశి
సూర్యుడు తన ఉన్నతమైన మేషరాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీకు కొత్త జాబ్ వస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. లవ్ లైప్ బాగుంటుంది.
మిథునరాశి 
సూర్యుడి రాశి మార్పు వల్ల మిథునరాశి వారు అదృష్టం కలిసి వస్తుంది. దీంతో వీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. మీరు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. 
వృశ్చిక రాశి 
మేషరాశిలో సూర్యుని గోచారం వల్ల వృశ్చిక రాశి వారు చాలా పురోగతిని పొందుతారు. మీ కష్టానికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. మీకు వివిధ వనరుల నుండి ఆదాయం వస్తుంది. మీ లవ్ లైవ్ అద్భుతంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. 


Also read: Shukra Gochar 2023: రేపటి నుండి ఈ రాశులపై డబ్బు వర్షం కురిపించనున్న శుక్రుడు.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook