Sun Transit in Scorpio 2022: సూర్యదేవుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. రెండు రోజుల కిందట అంటే నవంబర్ 16వ తేదీ, రాత్రి 7.15 గంటలకు బుధవారం నాడు గ్రహాల రాజు సూర్యభగవానుడు వృశ్చికరాశిలోకి (Sun Transit in Scorpio 2022) ప్రవేశించాడు. దీనినే వృశ్చిక సంక్రాంతి అంటారు. గౌరవం, కీర్తి ప్రతిష్టలను ఇచ్చే దేవుడు సూర్యుడు. వృశ్చికరాశిలో సూర్యుడి సంచారం వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహం (Leo): సింహ రాశి వారికి ఈ వృశ్చిక సంక్రాంతి శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. బిజినెస్ ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఆర్థికంగా మెరుగుపడుతారు. అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఫ్యామిలీ సపోర్టుతో మీరు అన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
వృషభం (Taurus): వృశ్చికరాశిలో సూర్యుడి సంచారం వల్ల మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అనవసరమైన గొడవలకు జోలికి పోకండి. మీరు మతపరమైన యాత్ర చేసే అవకాశం  ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబం మద్దతు లభిస్తుంది. 
మిథునం (Gemini): సూర్యుని సంచారము మిథునరాశి వ్యక్తుల పని ప్రాంతంలో అనుకూలమైన మార్పులను తీసుకురాగలదు. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి సమయం. మీరు మీ శక్తి మొత్తాన్ని ఉపయోగించవచ్చు. ఈ సమయంలో, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక ప్రగతికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితానికి అనుకూలమైన సమయం.


Also Read: Trigrahi Yoga: వృశ్చికరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి ఆర్థికంగా నష్టం... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook