Surya Gochar 2023: మార్చి 15 నుండి ఈ రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
Surya Gochar 2023: సూర్యభగవానుడు మార్చి 15న మీనరాశిలో సంచరించనున్నాడు. సూర్యుడి గోచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: గ్రహాలు మరియు రాశుల కదలిక ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటుంది. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు మార్చి 15న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. ఇప్పటికే బృహస్పతి అదే రాశిలో ఉన్నాడు. దీని కారణంగా మీనంలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఏర్పడుతుంది. సూర్య సంచారం ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం
మిధునరాశి
సూర్యుని గోచారం మిథునరాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీకు కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీకు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
వృషభం
సూర్యుని సంచారం వృషభరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. కెరీర్‌లో విజయం సాధిస్తారు. మీరు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద ఆర్డర్ లను పొందే అవకాశం ఉంది. సమాజంలో పాపులారిటీ పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
కర్కాటక రాశి
సూర్యుడు మరియు గురు గ్రహ కలయిక కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇవ్వబోతోంది. దీంతో మీరు భారీగా ప్రయోజనం పొందుతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు.
Also Read: Shani uday 2023: హోలీ ముందు ఈ రాశులకు పట్టనున్న అదృష్టం... ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook