Sun Transit 2023: సూర్యభగవానుడి మీనరాశి ప్రవేశం... ఈరాశులకు మంచి రోజులు ప్రారంభం..
Sun Transit 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యదేవుడు మీన రాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.
Sun Transit In Meen : ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు మార్చి 15న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం సూర్యదేవుడు శనిదేవుడి రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మీనంలోకి సూర్యుడి సంచారం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు శుభప్రదం
కర్కాటక రాశిచక్రం
సూర్యుని సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లోకి సంచరిస్తాడు. దీంతో మీకు అదృష్టం పట్టనుంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
మిథున రాశిచక్రం
సూర్యుని సంచారం మిథునరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ కర్మ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారవేత్తలు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కొత్త బాధ్యతలను తీసుకుంటారు. జాబ్ చేసేవారు పదోన్నతితోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది.
వృషభ రాశి
సూర్య గ్రహం యొక్క రాశిచక్రం మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మీ సంచార జాతకం నుండి ఆదాయ మరియు లాభ స్థానానికి బదిలీ కానున్నారు. దీంతో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. పాతపెట్టుబడుల నుండి లాభం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది తగిన సమయం.
Also Read: Shani Dev Blessings: శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే.. ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.