Surya Gochar 2022: సూర్యుడి `నీచభంగ రాజయోగం`.. ఈ రాశులకు ప్రత్యేక అనుగ్రహం..
Surya Gochar 2022: సూర్యభగవానుడు తులారాశిలో సంచరించాడు, దీనివల్ల నీచభంగ రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులవారు చాలా ప్రయోజనం పొందనున్నారు.
Surya Gochar 2022: సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు లేదా తిరోగమనం చేసినప్పుడల్లా.. అది నేరుగా దేశం మరియు ప్రపంచంపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యభగవానుడు తులారాశిలో సంచరించాడు. ఈ సూర్యుని సంచారం వల్ల నీచభంగం రాజయోగం (Neecha Bhanga Raja yoga) ఏర్పడుతుంది. ఇది అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. దీంతో మూడు రాశులవారు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందబోతున్నారు. ఈ రాశుల వారు కెరీర్‌తో పాటు వ్యాపారంలో కూడా మంచి విజయాలు సాధిస్తారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
తులారాశి (Libra): నీచభంగం రాజయోగం తుల రాశి వారికి కెరీర్ పరంగా చాలా లాభాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ రాజయోగం మీ జాతకంలోని లగ్నం స్థానంలో ఏర్పడుతోంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
మకరరాశి (Capricorn): మకర రాశి వారి జాతకంలో పదో ఇంట బలహీనమైన రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం ఉద్యోగ, వ్యాపారాలకు నిలయం. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో భారీగా లాభాల ఉంటాయి. పెళ్లికానీ యువతీ యువకులకు వివాహ సంబంధాలు రావచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
కర్కాటకం(Cancer): కర్కాటక రాశి యెుక్క నాల్గవ ఇంట్లో రాజయోగం ఏర్పడుతోంది. దీంతో ఈ రాశిచక్రం యొక్క ప్రజలకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. వాహనం కొనుగోలు చేసిన ఆనందం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆస్తి లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఎక్కడి నుంచో ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.
Also Read: Shukra Gochar 2022: శుక్రుడి సంచారం.... నవంబరు 11 నుండి ఈ రాశుల జీవితం అద్భుతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook