Surya Gochar 2022: జోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుని సంచారం కారణంగా రాశీచక్రంలోని రాశులకు సానుకూలం లేదా ప్రతికూల ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నెల అనగా మే 15న ఉదయం 4.50 గంటలకు సూర్యుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో సూర్యుడు శని నుంచి విముక్తి పొంది అంగారకుడి వద్దకు చేరుకుంటాడు. అంటే ఈ సమయంలో అంగారకుడి దృష్టి సూర్యునిపై ఉంటుంది. ఈ క్రమంలో సూర్యుని సంచారం కారణంగా ప్రభావితమయ్యే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి


సూర్యుని సంచారం కారణంగా మేష రాశి వారికి ప్రతికూల ప్రభావం ఉండనుంది. కాబట్టి.. ఏదైనా పనిచేసే ముందుకు ఓపిగ్గా ఆలోచించడం మేలు. ఎట్టిపరిస్థితిలోనూ తొందరపడొద్దు. మోసపోయే అవకాశం ఉంది. 


వృషభరాశి


వృషభ రాశి వారికి ఇలాంటి సమయంలో వివాదాలు పెరుగుతాయి. ఇది కాకుండా, వృధా మార్గంలో డబ్బు నష్టం కూడా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి.


మిధునరాశి


మిథున రాశి వారు సూర్యుని సంచార మార్పు వల్ల నిద్రలేమి సమస్య రావచ్చని, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతే కాకుండా అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి.


కర్కాటక రాశి


కర్కాటక రాశి వారు ఏ మంచి పని చేసినా ప్రమోషన్‌తో పాటు రివార్డులు కూడా లభించే అవకాశం ఉంది. అంతే కాకుండా కొత్త ఉద్యోగం కూడా పొందవచ్చు.


సింహరాశి (సూర్యుని రాశి)


సింహ రాశి వారికి ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగావకాశాలు దొరకడమే కాకుండా కొత్త పనులు చేయడం ద్వారా విజయం సాధించవచ్చు. ఏదైనా పని చాలా కాలంగా నిలిచిపోతే అది కూడా పూర్తవుతుంది.


కన్యారాశి


కన్యా రాశి వారికి ఈ సమయంలో ఇబ్బందులు పెరగవచ్చు. అలాగే, మీరు కుటుంబ సభ్యులు లేదా ప్రియమైన వారి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 


తులారాశి


రాశీచక్రంలో సూర్యుని సంచారం వల్ల తులారాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల అనేక వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అదే విధంగా అధికారులతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 


వృశ్చికరాశి


వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెన్షన్ పెరగవచ్చు. అంతే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు లేదా వ్యాధులు కూడా సంభవించవచ్చు. శారీరక శ్రమ కూడా పెరగవచ్చు.


ధనుస్సు రాశి


సూర్యుని సంచారణం కారణంగా ధనుస్సు రాశి వారికి వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా బలం పుంజుకునే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. 


మకరరాశి


సూర్యుని సంచారం కారణంగా మకరరాశి వారి ప్రేమ సంబంధాల్లో వివాదాలు రావొచ్చు. పిల్లల్లో సంతోషం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే వారు కూడా అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. 


కుంభ రాశి


కుంభ రాశి వారికి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది. వారి శరీరంలో వ్యాధులు లేదా అనారోగ్యాలు ఉండవచ్చు. దీనితో పాటు వ్యాపారంలో కూడా నష్టపోవచ్చు.


మీనరాశి


మీన రాశి ప్రజలు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు వస్తాయి. అలాగే ప్రమోషన్ కూడా ఉండవచ్చు. ఈ సమయం చాలా బాగుంటుంది.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించినది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 


Also Read: Lucky people:ఈ 4 రాశుల వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం..ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు


Also Read: Guru Gochar 2022: గురుగ్రహ సంచారం వల్ల ఈ 3 రాశులకు శుభకాలం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.