Surya Gochar In November 2022: సూర్య గ్రహాన్ని గ్రహాలకు రారాజుగా పిలుస్తారు. నిర్దిష్ట సమయంలో ఏ గ్రహమైన తమ రాశిని వదిలి ఇతర రాశిలోకి తిరోగమనం చెందుతుంది. అయితే దీని వల్ల కలిగే ప్రభావం 12 రాశులపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. నవంబర్ 16న మరోసారి సూర్యుడు ఇతర రాశిలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఈ సారి సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో పలు రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
మకరరాశి:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..ఈ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో మకర రాశివారికి కుటుంబ మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంతో సమయం గడుపుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ తిరోగమనం వల్ల పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు పొందే అవకాశాలున్నాయి. కెరీర్‌లో కొత్త మార్పులు పొందే అవకాశాలున్నాయి. వ్యాపార, ఉద్యోగాలల్లో కూడా విశేష లాభాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి సూర్యుడు అధిపతిగా పదవ స్థానంలో ఉండబోతున్నాడు. దీంతో ఈ రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. వృశ్చిక రాశి వారు జీవితంలో సంతోషాన్ని, శుభ ఫలితాలను పొందే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా సమాజంలో వీరిపై గౌరవం పెరుగుతుంది.  రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ క్రమంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు.


కన్య రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..సూర్యుడు ఈ రాశిలో మూడవ స్థానంలో సంచరించనున్నాడు.  సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల వైవాహిక జీవితంలో మార్పులు వచ్చ..ఈ క్రమంలో ఆనందం పొందే అవకాశాలున్నాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.


మిధునరాశి:
సూర్య రాశి సంచారం వల్ల మిధునరాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపారాలలో భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ కాలంలో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook