Mesh Sankranti 2023: మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నాం 03:12 గంటలకు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మేష సంక్రాంతి అంటారు. ఇదే రోజున మూడు శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అవే సిద్ధ యోగం, సధ్య యోగం మరియు సర్వార్థ సిద్ధి యోగం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పవిత్ర దినాన నదిలో స్నానం-దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు ఉదయం 10.55 నుండి సాయంత్రం 06.46 గంటల వరకు స్నాన దానానికి శుభ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఈరోజున పూర్వీకులకు తర్పణాలు వదలడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు ఈ రోజున మీ రాశి ప్రకారం దానం చేస్తే మీకు సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మేష సంక్రాంతి నాడు మీ రాశిని బట్టి దానం చేయడం వల్ల మీ జాతకంలో తొమ్మిది గ్రహాలు బలపడతాయి. 


మీ రాశి ప్రకారం ఈ వస్తువులను దానం చేయండి
1. మేషం
ఈ రాశి వారు మేష సంక్రాంతి రోజున ఎర్రని వస్త్రాలు, ఎర్రటి పూలు, పప్పు దానం చేయాలి.
2. వృషభం
వృషభ రాశి వారు పాలు, పెరుగు, తెల్లటి పూలు, తెల్లని వస్త్రాలు వంటి దానం చేయాలి.
3. మిథునం
మిథునరాశి వారు పచ్చని వస్త్రాలు, పచ్చి పండ్లు, పచ్చి కూరగాయలు డోనెట్ చేయడం మంచిది. 
4. కర్కాటకం
కర్కాటక రాశి వారు తెల్లని వస్తువులను దానం చేయాలి. చక్కెర, బటాషా, తెల్ల చందనం మొదలైనవి.
5. సింహం
సింహ రాశి వారు సూర్య భగవానుడికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. నారింజ మరియు ఎరుపు వస్త్రం, బెల్లం, గోధుమలు, ఎర్ర చందనం, పసుపు పువ్వులు మొదలైనవి.
6. కన్య
కన్యా రాశి వారు పచ్చని వస్తువులను దానం చేయాలి. ఇది బుధ గ్రహాన్ని బలపరుస్తుంది.
7. తులారాశి
తులారాశి వారు పూజానంతరం తెల్లని వస్తువులను దానం చేసి సువాసనతో కూడిన వస్తువులను డోనెట్ చేయడం మంచిది.
8. వృశ్చికం
వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఎందుకంటే మీ రాశికి అధిపతి కుజుడు.


Also Read: Budh Vakri 2023: మరో 10 రోజుల్లో ఈ 5 రాశులవారు ధనవంతులు కానున్నారు.. ఇందులో మీరున్నారా?


9. ధనుస్సు
ధనుస్సు రాశి వారు మేష సంక్రాంతి రోజున ఇత్తడి, పసుపు బట్టలు, పసుపును దానం చేయాలి.
10. మకరం
మకరరాశి వారు సూర్యభగవానుని పూజించిన తర్వాత ఉసిరి, నల్ల వస్త్రం, నల్ల నువ్వులు, దుప్పటి, ఇనుము మొదలైన వాటిని దానం చేయాలి.
11. కుంభం
కుంభరాశి వారు ఉసిరి, నల్ల గుడ్డ, నల్ల నువ్వులు, దుప్పటి, ఇనుము మొదలైన వాటిని కూడా డోనెట్ చేయాలి.
12. మీనం
మీన రాశి వారు విష్ణు చాలీసా, గీత, బంగారం, ఇత్తడి, పసుపు వస్త్రాలు, పసుపు దానం చేయాలి.


Also Read: Angaraka Yogam : అంగారక యోగం అంటే ఏమిటి? మీ జాతకంలో ఇది ఏర్పడితే ఏం జరుగుతుందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి