Sun Transit 2023 Effect: జూన్ 15న సూర్యభగవానుడు వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. గౌరవం మరియు విజయానికి కారకుడైన ఆదిత్యుడి రాశి మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. భానుడు సంచారం మకర రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుకూల ప్రభావం:


సూర్యుడి రాశి మార్పు మకరరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సూర్యుడి అనుగ్రహంతో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఎదగాలనుకునేవారికి ఈ సమయం బాగుంటుంది. మీ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. కీళ్లనొప్పులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహాతో మంచి మందులు తీసుకోండి. ఇంటి వివాదాలకు దూరంగా ఉండండి.  


ప్రతికూల ప్రభావం:


ఈ సమయంలో మకరరాశి వారు ఎలాంటి రుణం తీసుకోవద్దు. జూలై 17 వరకు మీరు చాలా కేర్ పుల్ గా ఉండాలి. మీరు తండ్రిని ఎక్కువగా గౌరవించాలి. మీరు మానసిక గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఇల్లు కూడా మారవచ్చు.  నెగిటివ్ ఆలోచనల నుంచి మీ మనస్సును దూరంగా ఉంచుకోండి. జాబ్ ఛేంజ్ అవ్వాలనుకునేవారు మంచి ఆఫర్ కోసం వేచి చూడండి. సహోద్యోగులతో అనవసరమైన వాగ్వాదం పెట్టుకోవద్దు.  కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునేవారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది. వీలైనంత వరకు అప్పులు తీసుకోకండి. 


Also Read: Shukra Gochar 2023: వచ్చే రెండు నెలల్లో ఈ రాశులవారు కుబేరులవ్వడం పక్కా..మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి