Sun transit 2023: సూర్య సంచారంతో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీరున్నారా?
Venus transit 2023: జూన్ 15 వరకు సూర్యభగవానుడు వృషభరాశిలో ఉండనున్నాడు. సూర్య సంచారం వల్ల మీరు ఊహించని ధనలాభం పొందుతారు. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Surya Gochar 2023 effect: సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని ఛేంజ్ చేస్తాడు. రీసెంట్ గా ఆదిత్యుడు వృషభరాశిలో సంచరించాడు. జూన్ 15 వరకు భానుడు అదే రాశిలో ఉంటాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు విపరీతమైన ఆదాయాన్ని పొందనున్నారు. భానుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
సింహరాశి
ఆదిత్యుడి సంచారం సింహరాశి వారికి కలిసి రానుంది. మీ ఆర్థికంగా బలపడతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఆఫీసులో మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు.
ధనుస్సు రాశి
మే నెలలో సూర్యుని సంచారం ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
Also Read: Shukra Gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడి గమనంలో పెను మార్పు.. ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
మీనరాశి
శుక్రుడి సంచారం వల్ల మీనరాశి వారు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
కర్కాటక రాశి
సూర్యుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేస్తారు. మీకు ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
Also Read: Astrology: నెలాఖరులో గ్రహాల సంయోగం.. ఈ 4 రాశులకు వద్దన్నా డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి