Sun Transit 2023 in telugu: జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాలు రాజు అని పిలుస్తారు. ఇతడు విజయం, ఆరోగ్యం, విశ్వాసానికి ప్రతీక. సూర్యుడి ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుడి యెుక్క రాశి మార్పునే సంక్రాంతి అంటారు.  రీసెంట్ గా సూర్యదేవుడు మీనరాశిలో సంచరించాడు. ఆ రాశిలోనే ఏప్రిల్ 14 వరకు ఉంటాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొన్ని  రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య సంచారం ఈ రాశులకు వరం
వృషభరాశి
సూర్యుడి గోచారం వల్ల వృషభరాశి వారు చాలా లాభపడతారు. ఆర్థికంగా బలపడతారు. వీరి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
మిథున రాశి
సూర్యుడి గోచారం మిథునరాశి వారికి చాలా మేలు చేస్తుంది. వీరికి సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారం ఎంతో మేలు చేస్తుంది. వీరికి ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు మరియు కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 
తుల రాశి
సూర్యుని రాశి మార్పు కారణంగా తుల రాశి వారు అనుకున్నది సాధిస్తారు. వీరు శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఏప్రిల్ 14 వరకు ఈ రాశివారికి అన్నీ శుభాలే జరుగుతాయి. 
వృశ్చికం
సూర్యుని సంచారం వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో భారీ లాభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టంతో మీరు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగపరంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
ధనస్సు
ఏప్రిల్ 14 వరకు వీరి పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బు వస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఈ సమయంలో మీరు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 


Also Read: Grah Gochar: వచ్చే నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు.. ఈ రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook