Surya Sankranti 2023: సూర్య సంక్రాంతి ఈ 4 రాశులకు అదృష్టాన్ని ఇస్తుంది.. ఇందులో మీరున్నారా?
Makar Sankranti 2023: మరో వారం రోజుల్లో సూర్యదేవుడు మకర రాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రానున్నాయి.
Surya Sankranti 2023: సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మార్చి వేరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు యెుక్క ఈ రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఈనెలలో అంటే జనవరి 14న సూర్యదేవుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనిన మకర సంక్రాంతి లేదా సూర్య సంక్రాంతి అంటారు. ఈ సూర్య సంక్రాంతి (Makar Sankranti 2023) వల్ల కొన్ని రాశుల అదృష్టం ప్రకాశించనుంది. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశం 5 రాశుల వారి జీవితాల్లో మార్పు రానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి మకర సంక్రాంతి శుభప్రదం
వృషభ రాశి (Taurus): సూర్య సంచారం వల్ల వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు లాభపడతారు. ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. తండ్రితో మీకు గల అనుబంధం ధృడపడుతుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీకు ప్రయోజనం కలుగుతుంది. మతపరమైన పనుల పట్ల విశ్వాసం పెరుగుతుంది.
మిథునం (Gemini): మిథునరాశి వారికి సూర్యుని సంచారం చాలా ప్రయోజనకరం. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారుల ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంి. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. టెన్షన్ తొలగిపోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి. కొన్ని పనుల విషయంలో చాలా కాలంగా ఉన్న టెన్షన్ తొలగిపోతుంది.
కర్కాటకం (Cancer): సూర్యుని సంచారం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. బిజినెస్ లో మీరు అనేక శుభఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మెుత్తానికి ీ సమయం బాగుంటుంది.
మకరరాశి (Capricorn): మకరరాశిలో సూర్యుని సంచారం ఈ రాశి వారికి స్పెషల్ బెనిఫిట్స్ ను ఇస్తుంది. వీరికి పాత సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాధులు దూరమవుతాయి. మీ పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడమే మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి.
Also Read: Mangal Gochar 2023: వృషభంలో సంచరించనున్న అంగారకుడు... వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.