Surya Gochar 2023: జూన్ 15న వృషభరాశి నుండి మిథునంలోకి ఆదిత్యుడు.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు!
Sun Transit 2023: రేపు సూర్యభగవానుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆదిత్యుడి సంచారం వల్ల నాలుగు రాశులవారి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar in Mithun Rashi on 15th June: గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. జూన్ 15న ఆదిత్యుడు వృషభరాశి నుండి మిథునరాశికి వెళ్లనున్నాడు. జూలై 16 వరకు భానుడు అదే రాశిలో సంచరించనున్నాడు. నెల రోజులపాటు అదే రాశిలో ఉండనున్నాడు. సూర్యుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సూర్య సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
వృషభం: సూర్య సంచారం వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలను ఇవ్వనుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని అందరితోనూ సఖ్యతగా ఉంటే మీకు మేలు జరుగుతుంది.
మిథునం: ఇదే రాశిలో సూర్యభగవానుడు సంచరించనున్నాడు. దీంతో మిథునరాశి వారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబం సంబంధాలు బలపడతాయి.
Also Read: Mars Transit 2023: 17 రోజుల పాటు ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
కన్య: సూర్య సంచారం మీకు కెరీర్ లో మంచి పురోగతిని ఇస్తుంది. మీ డబ్బు పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎంతటి కార్యన్నైనా సులభంగా సాధిస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
కుంభం : ఆదిత్యుడి రాశి మార్పు వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కెరీర్‌కు సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు మీ లవర్ తో మంచి సంబంధాలు బలపడతాయి.
Also Read: Mercury Set 2023: బుధుడి అస్తమయంతో ఈ 3 రాశుల జీవితం నాశనం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి