Surya Rashi Parivatan 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. సూర్యభగవానుడి రాశిమార్పునే మనం సంక్రాంతి అంటాం. సూర్యుడు.. విశ్వాసం, విజయం, తండ్రి, గురువు మరియు శక్తికి సంకేతకంగా భావిస్తారు. సూర్యుని సంచారం మొత్తం 12 రాశుల మీద పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఈనెల 17న సూర్యుడు తులారాశిలో (Sun transit in libra 2022) సంచరించబోతున్నాడు. నెల రోజులపాటు అక్కడే ఉంటాడు. తులరాశికి అధిపతి శుక్రుడు. ఇతడు లగ్జరీ, ఆనందం, ప్రేమ, శృంగారానికి అధిపతిగా భావిస్తారు. శుక్రుని రాశిలో సూర్యుడి ప్రవేశం 5 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య సంచారం ఈ రాశుల వారికి శుభప్రదం 
వృషభం (Taurus)- వృషభ రాశికి అధిపతి శుక్రుడు. తులరాశిలో సూర్య సంచారం ఈ రాశివారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. దీంతో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. 
సింహ రాశి (Leo)- సూర్యుని రాశి మార్పు సింహ రాశి వారికి కెరీర్ లో పురోగతినిస్తుంది. పెండింగ్ పనులు ప్రారంభమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. 
ధనుస్సు (Sagittarius)- సూర్యుని సంచారం ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. 


మకర రాశి (Capricorn)- సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల మకరరాశి వారికి కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
మీన రాశి (Pisces)- సూర్యుని రాశి మార్పు మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. లక్ తో అన్ని పనులు పూర్తి చేశారు. డబ్బు లాభిస్తుంది. కానీ ధన నష్టం కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: దసరా రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది, ఇక మీకు డబ్బే డబ్బు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి