Surya Gochar October 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల మార్పు చాలా ముఖ్యమైనది. గ్రహాల రాజు సూర్యభగవానుడు ఈనెల 17న రాశిని మార్చబోతున్నాడు. ఈరోజున కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి (Sun Transit in Libra 2022) ప్రవేశిస్తాడు. నెల రోజులపాటు సూర్యభగవానుడు అదే రాశిలో ఉంటాడు. తులరాశిలో సూర్య సంచారం మూడు రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి (Sagittairus)- సూర్య సంచారం వల్ల ధనస్సు రాశివారి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఏదైనా ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కొత్త బాధ్యతను పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. 
వృశ్చికం (Scorpio)- ఈ రాశి వారికి సూర్య సంచార సమయంలో ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ మరియు బోనస్ పొందవచ్చు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది. 
మేషరాశి (Aries) - మేష రాశి వారికి 11 రోజుల పాటు సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు. మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. మీరు కుటుంబ సమస్యల నుండి గటెక్కుతారు. ఈ సమయంలో శుభవార్తలను వింటారు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. పాత రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. 


Also Read: Shani Margi 2022: మకరరాశిలో శని ప్రత్యక్ష కదలిక... ఈ రాశులవారు బీ అలర్ట్..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి